కరోనా నేపథ్యంలో తిరుమలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను టీటీడీ కొట్టిపారేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడంతో అనేక అసత్య ప్రచారాలు జరగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలో అఖండ దీపం కొండెక్కిందనే ప్రచారం వీపరితంగా జరుగుతుంది. అయితే వీటిపై వివరణ ఇచ్చారు తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అఖండదీపం వెలుగుతూనే ఉంటుందని, అన్ని సేవలు కూడా స్వామివారికి జరుగుతున్నాయని ఆయన వివరించారు. భక్తులు ఎలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు.