గవర్నర్‌, సీఎం మే డే శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్రంలోని కార్మికలోకానికి, శ్రమజీవులందరికీ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, సీఎం కే చంద్రశేఖర్‌రావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించారు. కొవిడ్‌ నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని గవర్నర్‌ కోరారు. జాతినిర్మాణంలో, నాగరికతా వికాసంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. యావత్‌ సమాజం కార్మికవర్గానికి అండగా నిలువాల్సిన తరుణమిదని పిలుపునిచ్చారు.