రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ కరోనావైరస్ భారిన పడిన నేపథ్యంలో..ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేశారు. మిఖాయిల్ ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకుంటారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. రష్యన్ ప్రధాని మిషుస్టిన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకుని బయటకు వస్తారని ఆశిస్తున్నాని తెలిపారు. ఈ మేరకు రష్యన్, ఇంగ్లీష్ భాషలలో మోదీ ట్వీట్ చేశారు.